Apr 09,2023 10:28

ప్రజాశక్తి-మండపేట (తూర్పు గోదావరి) : మండలంలోని తాపేశ్వరం - ద్వారపూడి రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకుండానే సిసి రోడ్డు బీటలువారుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి నత్తనడకన సాగుతున్న ఈ రోడ్డు పనులతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సీసీ రోడ్డు పగుళ్ళతో నాణ్యత ప్రమాణాలపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యతతో త్వరితగతన రోడ్డు పనులు పూర్తి చేసి పలువురు వాహనదారులు కోరుతున్నారు. ఈ విషయంపై రోడ్డు భవనాల శాఖ జె.ఈ సూర్యనారాయణ వివరణ కోరగా పగిలిన దాన్ని తొలగించి కొత్తగా నిర్మాణం చేపడతామన్నారు.