Mar 18,2023 12:33

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : రెండు ఎమ్మెల్సీ స్థానాలు విజయం సాధించిన కారణంగా శనివారం తాడిపర్రులో టిడిపి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని రెండు ప్రదేశాలలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తాడిపర్రు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కిన సుధీర్‌ మాట్లాడుతూ .... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అనూహ్యంగా విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడంతో రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకత కనబడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో తాటిపర్రు గ్రామ తెదేపా నాయకులు , పెండ్యాల గోవిందరావు, వాకలపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.