ప్రజాశక్తి-చాగల్లు (తూర్పుగోదావరి) : టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నీరసనగా మండల టిడిపి నాయకులు చాగల్లు మెయిన్ రోడ్డు ఎన్టీఆర్ బొమ్మ వద్ద సిఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిడిపి నాయకులు నాదెళ్ల శ్రీరామ్ చౌదరి, కారుటూరు సతీష్, బొల్లిన శివ నాగేంద్ర, యడ్లపల్లి రమేష్, సుంకవల్లి రమేష్, దొంగ రామకృష్ణ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న టిడిపి నాయకులను చాగల్లు ఎస్‌ఐ సిహెచ్ వి.రమేష్, కొవ్వూరు రూరల్ ఎస్‌ఐ జె.సతీష్ అరెస్టు చేసి స్టేషన్ స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.










