ప్రజాశక్తి-కనగానపల్లి(అనంతపురం) : మండల పరిధిలోని కుర్లపల్లి తాండాకు చెందిన టిడిపి నాయకుడు రాజునాయక్(40) ఛాతి నొప్పితో మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం ఛాతిలో నొప్పిగా ఉందని రాజు నాయక్ కుటుంభం సభ్యులుకు చెప్పడంతో అనంతపురంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం తీసుకొచ్చారు. అయితే చికిత్స పొందుతూ రాజు నాయక్ మృతి చెంది నట్లుకుటుంభం సభ్యులు తెలిపారు. కుర్లపల్లి తాండకి చెందిన రాజు నాయక్ టీడీపీలో ఎంతో చురుగ్గా పాల్గొనేవాడు.. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుర్లపల్లి తాండ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసి వైసీపీకి గట్టి పోటీ నిచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.










