Mar 23,2023 14:50

ప్రజాశక్తి-ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : భగత్‌సింగ్‌ 92వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మండలంలోని మోర్త ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాలలువేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎస్‌.కార్తీక్‌ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి భగత్‌ సింగ్‌ ఉద్యమస్ఫూర్తితో నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శశికుమార్‌, దిలిప్‌, నాగ అంజి, ప్రధానోపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.