Jun 01,2023 15:16

ప్రజాశక్తి- గోకవరం(తూర్పుగోదావరి) : మండలంలోని కృష్ణుని పాలెం గ్రామపంచాయతీ పరిధి ఆర్‌ అండ ఆర్‌ కాలనీ వద్ద రూ.5 లక్షలతో నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌ను ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు. అనంతరం కొలనిలో నూతనంగా నిర్మించిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. గోకవరం గ్రామ శివారు నూతనంగా నిర్మించిన గంగాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్‌ రౌతు ఆదిలక్ష్మి జోగేశ్వరరావు, నండూరి గంగరావు గోకవరం మండలం సచివాలయాల కన్వీనర్‌ దాసరి రమేష్‌, వైసిపి రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి వరసాల ప్రసాద్‌, గోకవరం మండల వైసిపి కన్వీనర్‌ పాటి రాంబాబు, గోకవరం టౌన్‌ కన్వీనర్‌ చింతల అనిల్‌ కుమార్‌ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కర్రీ సూరారెడ్డి, గుల్లా ఏడుకొండలు, తంటికొండ సర్పంచ్‌ బడిరెడ్డి నారాయణమ్మ, అప్పన్న దొర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.