Feb 01,2023 16:09

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : వరి పంటపై పురుగు మందులను అవసరం మేరకే పిచికారి చేయాలని మండల వ్యవసాయ అధికారి మీసాల విశ్వాస రావు తెలిపారు. బుధవారం మండలంలోని పసలపూడి గ్రామంలో జరిగిన పొలంబడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పంట వాతావరణం, అధ్యయనం, పొలం పరిసరాలు విశ్లేషణ, మిత్ర పురుగులు, శత్రు పురుగుల అంచనా, సాలీడు, తూనీగలు, కందిరీగలు, పచ్చనల్లి , బారు మీసాల మిడత వంటి మిత్రపరుగు లను, కాండం తొలుచు పురుగు, ఆకు ముడత, లద్దె పురుగు వంటి శత్రు పురుగులను గుర్తించారు. ప్రస్తుతం వరి పిలకలు పెట్టే స్టేజ్‌లో ఉన్నందున, తక్కువ నీరు పెట్టుకున్నట్లయితే అధికంగా పిలక లొస్తాయని తెలిపారు.