ప్రజాశక్తి పెరవలి (తూర్పు గోదావరి జిల్లా) : జిల్లా స్థాయి పోటీల్లో పెరవలి క్రీడాకారిణి మూడు పతకాలను సాధించి సత్తా చాటింది. పశుసంవర్ధక శాఖ జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారం గ్రామంలో పశు వైద్య సహాయకురాలిగా పనిచేస్తున్న కుమారి బాలం అనంత లక్ష్మీదుర్గ 26వ తేదీన జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మూడు పథకాలను గెలుచుకుని కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు. టెన్నికాయిట్ సింగిల్స్ లో మొదటి బహుమతి, షార్ట్ పుట్ లో మొదటి బహుమతి, త్రో బాల్ లో రన్నర్ గా మూడు పతకాలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు. వెటర్నరీ డాక్టర్ సల్మా, డాక్టర్ చరణ్, జెవిఒ ఎఆర్. సోమేశ్వరి, విఎల్‌ఒ శ్యామ్, పశు వైద్య సహాయకులు రాము, శేఖర్, భవాని, నరేంద్ర, లక్ష్మణ్, సంజరు, సర్పంచ్ బండారు వెంకటరమణ, సాయిబాబా, ఎంపీపీ కె. సీతారాం ప్రసాద్, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.










