ప్రజాశక్తి-చాగల్లు (తూర్పుగోదావరి) : విజయదశమి సందర్భంగా చాగల్లు ఒళ్ళు గుంట (శెట్టి బలిజ సంఘం) కనకదుర్గ దేవాలయం ప్రాంగణంలో మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమాలు మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రారంభించారు. రాష్ట్ర జాక్ బిసి కన్వనర్ మార్గాని నాగేశ్వరావ్ను దంపతులు ప్రత్యేక పూజలు జరిపి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. కట్టా దుర్గా ప్రసాద్ దంపతులు 108 చీరలను ఉత్సవ కమిటీకి అందజేశారు. సందర్భముగా దాతలు ఇచ్చిన పసుపు కుంకాలు చీరలు కలశాలు మంత్రి డాక్టర్ తానేటి వనిత చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శెట్టిబలిజ యవత సంఘ పెద్దలు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించాకొన్నారు.










