Jul 14,2023 11:43

ప్రజాశక్తి-బిక్కవోలు (తూర్పు గోదావరి) : టిడిపి సీనియర్‌ నాయకుడు తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పడాల ఆదినారాయణ రెడ్డి (బుజ్జి) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన నాటి నుండి ఆదినారాయణ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహారిస్తూ, పార్టీకి క్రమశిక్షణతో సేవలందించారని, వారు లేని లోటు పార్టీకి తీరనిదని నేతలు స్మరించుకున్నారు. ఆదినారాయణ రెడ్డి మృతికి సంతాపం తెలియచేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పలువురు టిడిపి నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.