ప్రజాశక్తి-రొద్దం (అనంతపురం) : అక్రమంగా కర్నాటక మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని రొద్దం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పెనుకొండ ఎస్‌డిపిఓ పర్యవేక్షణలో, పెనుకొండ సిఐ ఆధ్వర్యంలో ఆదివారం రొద్దం పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ఎస్ ఐ నాగస్వామి తన సిబ్బంది సహాయంతో మండలంలోని రాచూరు గ్రామ సమీపంలో అక్రమంగా కర్నాటక మద్యం తరలిస్తున్న చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దాల గ్రామానికి చెందిన కే.మారుతి సన్ అఫ్ నారాయణ అను అతనిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి మొత్తం 96 కర్నాటక 90 ఎం ఎల్ పాకెట్స్ ను, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు.










