హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 81.6లక్షల విలువైన 1.32 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అతడిపై కస్టమ్ చట్టం 1962 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.










