Aug 07,2023 15:22

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : ఇటీవల బదిలీలు, ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర పూర్వ కార్యదర్శి అయినపర్తి రాజ గోపాల్‌ సోమవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత రెండు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఉపాధ్యాయులు పలు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉపాధ్యాయులకు చెందిన అనేక సమస్యల పరిష్కారం కోరుతూ, రాష్ట్ర కౌన్సిలర్‌ కోట రామ ప్రసాద్‌ ఉండ్రాజవరం తహశీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.