Oct 08,2023 13:10

ప్రజాశక్తి-గోకవరం (తూర్పు గోదావరి) : మండలంలోని రంపఎర్రంపాలెంలో జరగనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు పై ఆదివారం వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కర్రీ శివరామకృష్ణ అధ్యక్షతన గ్రామ సచివాలయం కన్వీనర్లు, నాయకులు, గృహ సారథులు, వలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోకవరం మండల వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ పాటి రాంబాబు పాల్గొని మాట్లాడుతూ ... ప్రతి ఒక్కరు వైఎస్సార్‌ కుటుంబ సభ్యులు 11వ తేదీన జరగనున్న జగనన్న ఆరోగ్య సురక్ష అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పాల్గొంటారని, ప్రతి ఒక్కరు ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. జరగబోయే రెండు కార్యక్రమాలును వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే చంటిబాబు జన్మదిన సందర్భంగా భారీ కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాకారపు ధర్మరాజు, అడబాల వెంకటేశ్వరరావు, సరుకుల నానిబాబు, పాలిపి వెంకట రమణ, ఎస్‌ఎస్‌.గుప్తా,పి సత్యానందం, గండికోట రామకఅష్ణ, నక్కా పాండురంగ, కడవల వీరపండు, కార్యదర్శి గోపన్న దొర సచివాలయం సిబ్బంది, గ్రామ వలంటీర్లు, కన్వీనర్లు గృహ సారథులు పాల్గొన్నారు.