May 13,2023 12:39

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ : రాజమండ్రి ఎంపి భరత్‌ రామ్‌ కారు ఢీకొట్టడంతో రిటైర్డ్‌ పశువుల డాక్టర్‌ మృతి చెందిన ఘటన శనివారం దెందులూరు మండలం కొత్తగూడెం రహదారిపై జరిగింది. దెందులూరు ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగూడెం రోడ్డుపై బైక్‌పై వెళుతున్న భీమడోలుకు చెందిన రిటైర్డ్‌ పశువుల డాక్టర్‌ శృంగవృక్షం.నరసయ్యను రాజమండ్రి ఎంపి భరత్‌ రామ్‌ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఎంపి భరత్‌ రామ్‌ ఉన్నట్టు సమాచారం. సమాచారం మేరకు ఘటనా స్థలానికి దెందులూరు పోలీసులు చేరుకున్నారు. ఎంపి కారును పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.