ప్రజాశక్తి - ఉండ్రాజవరం(పశ్చిమగోదావరి) : 'పేరుకుపోయిన చెత్త' పేరుతో తూర్పుగోదావరి జిల్లా ప్రజాశక్తి దినపత్రికలో గురువారం ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. తాడిపర్రు పంచాయతీ కార్యదర్శి పి.సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్మికులు పేరుకుపోయిన చెత్తను తొలగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్నది వర్షాకాలం కావడంతో ప్రజలు చెత్తా, చెదారాలను డ్రైనేజీలలో వేయకుండా పారిశుధ్య సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా అందించి, సహకరించాలన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు డంపింగ్ యార్డ్ నిర్మాణం జరిగితే చెత్త సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందన్నారు.










