ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : పోలీసు సిబ్బంది ఉదయము నుండి తమ దైనందిక జీవితంలో విధి నిర్వహణలో అనేకమైన మానసిక ఒత్తిడిలకు గురవుతారని, ఆ ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు వ్యాయామం తప్పనిసరిగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. కడియం పోలీస్ స్టేషన్ వద్ద ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఇండోర్ బ్యాట్మెంటన్ కోర్టును, అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫిష్ అక్వేరియంను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ఉదయం నుండి ఉద్యోగ నిర్వహణలో అనేక మానసిక ఒత్తిడిలకు గురై అనారోగ్య పాలవుతున్నారని వ్యాయామం చేయటం వల్ల ఒత్తుడుల నుండి బయట పడవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలిపారు. అలాగే ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫిష్ అక్వేరియంలో గల రంగురంగుల జల పుష్పాలు మనసును హత్తుకునేలా ఉందని అభినందించారు. ప్రశాంతతకు నిలయాలైన పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలను నాటాలని ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ వద్ద ఓ ఫల జాతి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఏపిపిఎస్ అడిషనల్ ఎస్పీ ఎం రజిని, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎస్ ఆర్ రాజశేఖర్ రాజు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్) జి వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి డి రామవర్మ, సౌత్ జోన్ డిఎస్పి కె శ్రీనివాసులు, కడియం, ధవళేశ్వరం సిఐలు పివిజి తిలక్, కె మంగాదేవి, పోలీస్ సిబ్బంది సిహెచ్ వెంకటరత్నం, కె సురేష్ బాబు, ఎం శ్రీను బాబు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










