ప్రజాశక్తి-గోకవరం(తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం గ్రామంలోని మురళి నగర్ శివాలయం వద్ద మంచినీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో నీళ్ల సరఫరాకు ఇబ్బంది ఎర్పండి. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామపంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్ పంచాయతీ సిబ్బందితో పైపులైను పునరుద్ధరణ పనులు చేపట్టారు. సాయంత్రంలోగా పనులు పూర్తి చేసి అందరికీ మంచినీళ్లు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని శ్రీనివాస్ తెలిపారు










