Jul 06,2023 15:10

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పుగోదావరి) : ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవం సందర్భంగా పశు వైద్యశాల, చాగల్లు వారి ఆధ్వర్యంలో కుక్కలకు ఉచితంగా రేబిస్‌ వ్యాధి నివారణ టీకాలను వేశారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ మట్ట.వీరాస్వామి చాగల్లు గ్రామసర్పంచ్‌ ఉన్నమట్ల.మనశ్శాంతి పాల్గొని ఈ కార్యక్రమాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుక్కల ద్వారా వచ్చే రాబీస్‌, లెప్టోస్పైరోసిస్‌, తామర, జీవాలు, పశువుల ద్వారా బ్రూసెల్లోసిస్‌,ఆంత్రాక్స్‌, టి బి,పందుల ద్వారా మెదడు వాపు,కోళ్ల ద్వారా ఫ్లూ మొదలగు వివిధ రకాల జంతు సంక్రమణ వ్యాధుల నివారణపై,రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 62 కుక్కలకు రాబీస్‌ వ్యాధి టీకాలు వేసినట్లు డాక్టర్‌ యు.ముఖేష్‌, డాక్టర్‌.సుజిత, పశువైద్య సహాయకులు గౌతమ్‌, పాల్గొన్నారు.