ప్రజాశక్తి- ధవళేశ్వరం (రాజమహేంద్రవరం) : రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరంలోని స్థానిక సాయి నగర్ కు చెందిన సిద్దిరెడ్డి.రవికుమార్ (35) శనివారం సాయంత్రం హత్యకు గురయ్యాడు. రవికుమార్ వృత్తి రీత్యా డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిద్దిరెడ్డి రవికుమార్ శ్రీకాకుళం జిల్లా కొత్తకోటలో ఉన్న నాలుగు ఎకరాలు పంచాలని తన బాబాయి సిద్ది రెడ్డి.శ్రీనివాస్ రావు శనివారం నాడు ఉదయం ఇంటికి వెళ్లి గొడవ పడి వెళ్లిపోయాడు. సాయంత్రం శ్రీనివాస్ రావు కుమారుడు రమేష్ నాయుడు ఫోన్ చేసి ఇంటికి రా మాట్లాడుకుందాం... అని చెప్పడంతో రవికుమార్ వారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆస్తి కోసం వారిద్దరి మధ్య మాట పెరగడంతో ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ గొడవలో రవికుమార్ శ్రీనివాసరావును పట్టుకోగా రమేష్ నాయుడు విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రవికుమార్ భార్య ఫిర్యాదుతో ధవలేశ్వరం సిఐ కే.మంగాదేవి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్య చేసిన చిన్నాన్న, అతని కొడుకు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.










