Apr 11,2023 15:11

ప్రజాశక్తి - ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : ఉండ్రాజవరం మండల బీసీ సంక్షేమ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల బీసీ నాయకులు పాలాటి శరత్‌ బాబు మాట్లాడుతూ.. భారతదేశంలో సామాజిక విప్లవానికి పునాది వేసిన ఉద్యమకారుడు, కుల నిర్మూలన కోసం రాజీలేని పోరాటం చేసిన విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. బీసీ సంఘ అధ్యక్షులు పి.వి.రాము మాట్లాడుతూ.. భారతదేశ బీసీ నాయకునిగా కీర్తి గడించిన పూలే జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ సంఘం నాయకులు బొక్క వెంకటేశ్వరరావు, గుబ్బల రాఘవులు, బొక్కా నరసింహమూర్తి, మండల బీసీ సంఘం నాయకులు, బీసీ సంఘం ఉపాధ్యక్షులు కోన జయ, వెలిగట్ల ప్రభువరం, కోమటి సత్యనారాయణ, అధికార ప్రతినిధి మారిశెట్టి నాగేశ్వరరావు, కారంకి వెంకటేశ్వరరావు, కోమటి రామకష్ణ, బొక్కా బాలకష్ణ, బొక్కా దానయ్య, కట్టా శ్రీరామ్‌, కోన కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. సూర్యారావు పాలెం గ్రామ సచివాలయంలో సర్పంచ్‌ లలిత కుమారి, కార్యదర్శి బాలకృష్ణ, తదితరులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.