ప్రజాశక్తి- గోకవరం :గత కొంతకాలంగా నిరంతరంగా విద్యుత్ కోతలతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పద్ధతి మార్చుకోకపోతే విద్యుత్ కోతలకు నిరసనగా ప్రజా ఉద్యమం చేపడతామని శుక్రవారం మండల విద్యుత్ శాఖ ఏఈ అశోక్ కి టిడిపి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వనికి పరిపాలన చేతకాదని ప్రజలకు అర్థమైందని ఈ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో చేసిన విద్యుత్ ఒప్పందాలను ఈ ప్రభుత్వం వచ్చి రద్దు చేసిందని తెలిపారు. భావితరాల భవిష్యత్తు కోసం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాటలు వేస్తే సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అంధకారంలోకి నిట్టారని తెలిపారు. సీఎం జగన్ విద్యుత్ చార్జీలు పూర్తిగా తగ్గిస్తానని గొప్పలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు వీర బోదుడు బాదుతున్నాడని అన్నారు. టిడిపి ప్రభుత్వం హాయంలో విద్యుత్ చార్జీలు పెంచకుండా పరిపాలన అందిస్తే అప్పటి ప్రభుత్వంలో వేయవలసిన చార్జీలన్నీ ఇప్పుడు విద్యుత్ బిల్లులో కలిపి ప్రజలను అన్ని రకాలుగా పిండేస్తున్నారని తెలిపారు. విద్యుత్ చార్జీలు భారమైన ప్రజలు కడుతున్నారని ఈ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ను అందించలేకపోతుందని టిడిపి నాయకులు ఎద్దేవాచేశారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ తో గ్రామాలను అందకారంలోకి నెట్టేస్తే సహించేది లేదని విద్యుత్ ఇక్కట్లతో ప్రజల తీవ్ర అసహనానికి లోనవుతున్నారని ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని ప్రభుత్వని హెచ్చరించారు. సమాచారం కోసం విద్యుత్ సబ్ స్టేషన్ కి ఫోన్ చేస్తుంటే ఉద్యోగులు ఎవరు స్పందించడం లేదని సరైన సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలూరి బోసుబాబు రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గురుపే భరత్ టౌన్ కన్వీనర్ పోసిన ప్రసాద్ గునిపే భీమరాజు కొల్లపు చంటి వీరబాబు వడ్లపాటి పవన్ సుబ్బారావు గునిపే బాల పాల్గొన్నారు










