ప్రజాశక్తి-చాగల్లు(తూర్పుగోదావరి) : జాతీయ పోషక ఆహార దినోత్సవం సందర్భంగా ఐసిడిసియస్ ఆధ్వర్యంలో మంగళవారం చాగల్లు జిల్లా పరిషత్ హైస్కూలు 8, 9, 10 తరగతి విద్యార్థులకు పోషకాహారంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఊబకాయం, షుగర్, రక్తహీనత రాకుండా రాగులు, సజ్జలు తదితర ఆహారాన్ని తీసుకోవాలి అని పాస్టుఫుడ్‌కి దూరంగా ఉండాలని ఐసిడిసియస్ సూపర్ వైజర్ పద్మావతి తెలిపారు. అనంతరం పాఠశాల హెచ్‌ఎం పి.వీర్రాజు అధ్వర్యంలో విద్యార్థులులతో ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అంగనవాడీ కార్యకర్తలు, బాలకిశోరాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










