Sep 13,2023 14:52

ప్రజాశక్తి-గోకవరం(తూర్పుగోదావరి) : అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి పింఛన్లు అందిస్తామని గోకవరం మండలం వైసిపి కన్వీనర్‌ పాటి రాంబాబు అన్నారు. బుధవారం మండలంలోని రంపఎర్రంపాలెం గ్రామంలో పాటి రాంబాబు నూతనంగా మంజూరైన 23 పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామఉప సర్పంచ్‌ దాకారపు ధర్మరాజు, మాజీ సర్పంచ్‌ తొట్ట సత్యనారాయణ, అడబాల వెంకటేశ్వరరావు, పాలిపి వెంకటరమణ, పెనుగొండ సత్యానందం, సత్యవరపు గుప్తా, గ్రామ వాలంటీర్లు, గృహ సారధులు, సచివాలయం సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.