Jun 28,2023 11:53

ప్రజాశక్తి -గోకవరం (తూర్పు గోదావరి) : మండల కేంద్రమైన గోకవరం గ్రామానికి చెందిన సీనియర్‌ వైసీపీ నాయకులు నరాలశెట్టి నరసయ్య గోకవరం మండలం వైయస్సార్‌ సేవాదళ్‌ కన్వీనర్‌ గా నియమించినట్లు గోకవరం మండలం సచివాలయాలు కన్వీనర్‌ దాసరి రమేష్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ ... వైఎస్‌ఆర్‌ సేవాదళ్‌ గోకవరం మండల కన్వీనర్‌ గా నియమించిన శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు కి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ పదవి రావడానికి సహకరించిన గోకవరం మండల వైసీపీ నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు నివాస గృహం వద్ద ఎమ్మెల్యే చంటిబాబుకి మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.