ప్రజాశక్తి - ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : మండలం నుండి జిల్లా స్థాయిలో బెస్ట్ డాట్ ప్రొవైడర్లుగా బి.నాగమణి, ధనలక్ష్మి ఎంపికైనట్లు ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం పీహెచ్సీలో జరిగిన ఆశా డేలో కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ క్షయ నివారణ కార్యక్రమంలో ఆశ కార్యకర్తల ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందన్నారు. క్షయ వ్యాధిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిబి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ ఆశాజ్యోతి మండలంలో జిల్లాస్థాయిలో బెస్ట్ డాట్ ప్రొవైడర్స్‌గా ఎంపికైన వారినిఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ సుబ్రహ్మణ్యం, ఎంపిహెచ్ ఎస్ చిరంజీవి, పిహెచ్‌ఎన్ కుమారి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










