Dec 08,2022 16:55

ప్రజాశక్తి- పుత్తూరు టౌన్‌(తిరుపతి) : పట్టణంలోని పురపాలక సంఘంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఆర్‌.కె.రోజా గురువారం ప్రారంభోత్సవాలు చేశారు. పుత్తూరు పట్టణంలో ఎస్‌.ఆర్‌.ఎస్‌ డిగ్రీ కళాశాల సమీపంలో - 14 వ ఆర్థిసంఘం నిధులతో అంచనా విలువ రూ.50 లక్షలతోవాసవి నగర్‌, సాయి నగర్‌, వీరపారెడ్డి పాలెంలో నిర్మించిన సిమెంట్‌ రోడ్డును ప్రారంభించారు..పుత్తూరు మునిసిపాలిటీ పిళ్ళారి పట్టు రోడ్డులో 14 వ ఆర్ధికసంఘం నిధులు అంచనా ఖర్చు 25 లక్షల రూపాయలతో పిళ్ళారి పట్టు లో సిమెంటు రోడ్డు మరియు గాంధి నగర్‌ నందు నిర్మించిన సిమెంట్‌ రోడ్డును ప్రారంభించారు. పుత్తూరు మునిసిపాలిటీ కార్యాలయంలో 15 వ ఆర్థిక సంఘం నిధులు 37 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన జేసిబిని ప్రారంబించారు. పురపాలక సంఘం సాదారణ నిధులతో ఆధునికరించిన బస్సుషెల్టర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌, ఏ హరి వైస్‌ చైర్మన్‌లు డి.శంకర్‌, డి.జయ ప్రకాష్‌, కౌన్సిలర్లు, బాలసుబ్రమణ్యం, నరసింహారావు, ఎడి.పవన్‌కుమార్‌, మునిసిపాల్‌ కమీషనర్‌ కే.ఎల్‌ఎం ఎన్‌ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.