ప్రజాశక్తి - ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడకుండా రుచికరంగా ఉండేలా చూడాలని ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి అన్నారు. మోర్త జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం ఎంపీపీ, తహశీల్దార్ జి.కనకరాజుతో కలిసి పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ణయించిన మెనూను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిటికెన సుజని, ఉప సర్పంచ్, ఇంచార్జ్ ఈవోపీఆర్డి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










