ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణీలను తణుకు నిసా హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ అయేషా ఖాన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఆర్. ఉషా దేవి పరీక్షలు చేశారు. 25 మంది గర్భిణీ స్త్రీలను పరీక్షించి, వారికి తగిన సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ ప్రసాద్, పిహెచ్‌ఎన్, కేడివిఎల్ కుమారి, సూపర్వైజర్ కే.నాగమణి, స్టాఫ్ నర్సులు కుమారి, సంధ్య, ఝాన్సీ రాణి, ఏఎన్‌ఎంలు, ఆశాలు, పాల్గొన్నారు.










