ప్రజాశక్తి - ధవలేశ్వరం (తూర్పు గోదావరి) : ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ... మంగళవారం ధవలేశ్వరంలో వైద్య సిబ్బంది ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలోని పిహెచ్సీ సిబ్బంది, ఏ.ఎన్.ఎం.లు, ఆశా కార్యకర్తలందరూ ర్యాలీ గా వెళ్లి దోమల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహనను కల్పించారు .










