ప్రజాశక్తి-ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : మండలంలోని దమ్మెన్ను గ్రామపంచాయతీ 9వ వార్డు సభ్యునిగా మట్టపర్తి అచ్యుతరామయ్య గురువారం పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన టిడిపి బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీ పరిధిలో వివిధ ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించాల్సిందిగా సర్పంచ్ గురజర్ల వీర వెంకట సత్యనారాయణను కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గూడూరి వెంకటకృష్ణ, సోమా వెంకటేశులు, ఎంఎస్‌ఎల్‌ఎన్ శిరీష, వి.కోటేశ్వరరావు, కె.కాంతి కుమారి, వి.శివాని, కే.వెంకట్రావు, జె.సౌందర్య తదితరులు పాల్గొన్నారు.










