Oct 08,2023 16:01

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ ఆరెస్టునును నిరసిస్తూ, మండలంలోని మాధవరాయుడుపాలెం శివారు చైతన్య నగర్‌లో గ్రామ సర్పంచ్‌ అన్నందేవుల చంటి ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సందర్శించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్బంగా గోరంట్ల మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ ఆరెస్టును ఊరూ, వాడా ప్రజలంతా ఖండిస్తున్నారని , రాబోవు రోజుల్లో ప్రజాగ్రహానికి గురై జగన్‌ ప్రభుత్వం పతనమవ్వడం ఖాయమన్నారు. ఈ శిబిరంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు , అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు దీక్షకు సంఘీభావం తెలియజేశారు.