Feb 07,2023 15:12

ప్రజాశక్తి - కడియం : జగనన్న శాశ్వత భూహక్కు , భూరక్ష పధకం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని రాజమహేంద్రవరం రూరల్‌ వైసిపి కో ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ తెలిపారు . మండలంలోని వేమగిరిలో మంగళవారం భూహక్కు పత్రాలను పంపిణి చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ పధకం ద్వారా అన్నిభూములను ఆధునికత , సాంకేతిక పరిజ్ఞానంతో , ఎలాంటి వివాదాలకు తావులేకుండా రీసర్వే చేయనున్నామన్నారు. దీంతో రైతులకు ఎంతో మేలుజరిగి ఉపయోగకరంగా ఉంటుందన్నారు .ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ సుజాత , గ్రామ మాజీ సర్పంచ్‌ వెలుగుబంటి వెంకటాచలం , పలువురు నాయకులు పాల్గొన్నారు .