Aug 28,2023 17:27

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పుగోదావరి) : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం సోమవారం చాగల్లులో పర్యటించారు. ఈ సందర్భంగా వైసిపి మండల శాఖ గౌరవాధ్యక్షులు జుట్టా కొండలరావు నివాసంలో పలువురు నాయకులను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వైసిపి నాయకులు గండ్రోతు సూర్యనారాయణ భార్య నాగమణి ఇటీవల మృతి చెదడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు గండ్రోతు సురేంద్ర కుమార్‌, ఎంపిటిసి ఇంటి బాలా వెంకటకృష్ణ వేణి, తోట రామకృష్ణ, పిండి మంగరాజు, అనిశెట్టి సూర్యం,గవర సర్వరాయుడు, వర్ధినీడి చిన్న బాబు, బొర్రా రజనీ ప్రసాద్‌, దులిపూడి సూరిబాబు, ఉప్పులురి బాబురావు, ముద్రగడ భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.