Oct 19,2023 15:20

ప్రజాశక్తి- గోకవరం(తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో దేవి చౌక్‌ వద్ద కనకదుర్గ అమ్మవారిని, అలాగే గద్దెలో వెలసిన కనకదుర్గ అమ్మవారిని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జ్యోతుల నెహ్రూకి కుంభాభిషేకంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వరసాల ప్రసాద్‌, ఇనకోటి పెద్దులు, బత్తుల నానాజీ, కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు మంగ రౌతు రామకృష్ణ, మాజీ జెడ్పిటిసి పాలూరి బోసుబాబు, బత్తుల సత్తిబాబు, పోసిన ప్రసాద్‌, మండిగ గంగాధర్‌, గుండా శివప్రసాద్‌, బద్దిరెడ్డి బాబి, గడ్డం బాబు తదితరులు పాల్గొన్నారు.