ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : మాజీ మంత్రి, సహచరుడు దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు చిరస్మరణీయుడని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం జక్కంపూడి జయంతి వేడుకల్లో భాగంగా మండలంలోని బుర్రిలంకకు మంత్రి విచ్చేశారు. గ్రామానికి చెందిన కొత్తపల్లి శివాజీ, కొత్తపల్లి మూర్తి సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు , రూరల్ వైసిపి కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ లతో కలిసి ప్రారంభించారు. అలాగే గ్రామంలో గల జక్కంపూడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల జెసిఎస్ అధ్యక్షులు తాడాల చక్రవర్తి సమకూర్చిన దుప్పట్లు , చీరలు , లుంగీలు , రుమాళ్లు నిరుపేద మహిళలకు , వృద్ధులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో జక్కంపూడి చిరస్థాయిగా నిలిచారని , అందుకు చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలే నిదర్శనమన్నారు. కొన్ని సంవత్సరాలుగా జక్కంపూడి పేరిట రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ , నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న కొత్తపల్లి సోదరులు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి యువనేత జక్కంపూడి గణేష్ , నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు మల్లు పోలరాజు , కార్యదర్శి గాదా నాగేశ్వరరావు , ఐఎన్‌ఏ మాజీ అధ్యక్షులు పల్ల సుబ్రహ్మణ్యం , నాయకులు గిరజాల బాబు , వై.స్టాలిన్ , డా''. వెలుగుబంటి వెంకటాచలం , భీమిరెడ్డి నాగేంద్ర , యీలి గోపాలం , తిరుమలశెట్టి శ్రీనివాస్ , అన్నందేవుల దుర్గారావు , ఊటుకూరి శైలజ , అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గన్నారు.
- మండలంలో ఘనంగా జక్కంపూడి జయంతి వేడుకలు
మండలంలోని వేమగిరిలో గ్రామ మాజీ సర్పంచ్ డాక్టర్.వెలుగుబంటి వెంకటాచలం ఆధ్వర్యంలో జక్కంపూడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అంబటి రాంబాబు పాల్గని వెంకటాచలం సమకూర్చిన నూతన దుస్తులను , సుమారు 300 మంది నిరుపేదలకు అందజేశారు. జేగురుపాడులో గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ , కడియపులంక దోసాలమ్మ కాలనీ, జాతీయ రహదారి కూడలి యందు ప్రముఖ నర్సరీ రైతులు పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల సత్తిబాబు , అలాగే పలు గ్రామాల్లో వైసిపి నాయకులు, సొసైటీ చైర్మన్‌లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జక్కంపూడి అభిమానుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.










