ప్రజాశక్తి- గోకవరం(తూర్పుగోదావరి) : మండలంలోని కామరాజుపేట గ్రామపంచాయతీ పరిధి జగన్నాధపురం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల సచివాలయాల కన్వీనర్ దాసరి రమేష్, వైసిపి నాయకులు సుంకర వీరబాబు పాల్గొని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు జగనన్న ఆరోగ్య సురక్షలో పేదలకు ఉచితంగా అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను గూర్చి వివరించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శిబిరాన్ని, ఐసిడిఎస్ అంగన్వాడి ద్వారా గర్భిణీ, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వంటకాలను పరిశీలించి గర్భిణీలకు పౌష్టికాహారం కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అడపా వెంకట్రావు, ఎంపీటీసీ మజ్జురి అప్పారావు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బదిరెడ్డి నాగ వెంకటేశ్వరరావు, సింబోతుల శ్రీనివాస్,బదిరెడ్డి రాంబాబు, చింతల అనిల్ కుమార్,గంధం మణికంఠ, ఎంపీడీవో కే పద్మజ్యోతి, కార్యదర్శి గోపన్నదొర, సచివాలయం సిబ్బంది, ఆరోగ్య, అంగన్వాడీ, ఆశ, వలేంటీర్లు పాల్గొన్నారు.










