Oct 05,2023 16:45

ప్రజాశక్తి- గోకవరం(తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం గ్రామపంచాయతీ నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోకవరం మండల సచివాలయల కన్వీనర్‌ దాసరి రమేష్‌, వైసీపీ సీనియర్‌ నాయకులు సుంకర వీరబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌ కర్రీ సూరరెడ్డి పాల్గొన్నారు. ముందుగా పంచాయతి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటానికి పులమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్‌ సందర్శించారు. ప్రధానంగా గర్భిణీ, బాలింతలకు ఐసిడిఎస్‌ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహార వంటకాల స్టాల్స్‌ ను సందర్శించి రుచిచూశారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామీణ, పట్టణా ప్రాంతంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సూరక్ష పేదల పాలిట వరంగా భావించాలని అన్నారు. ఎంతో డబ్బులు హేచ్చించి పరీక్షలు చేయించుకోలేని వారికి ఆరోగ్య సురక్ష ఉచితంగా అన్ని పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నరాలశెట్టి నరసయ్య, తోలేటి రాంప్రసాద్‌, చింతల అనిల్‌ కుమార్‌, దాసరి సతీష్‌, బత్తుల నానాజీ, తహశీల్దార్‌ డి సుగుణ, ఈఓపిఆర్డీ ఎం రాజేశ్వరరావు, కార్యదర్శి శ్రీనివాస్‌, అంగన్వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు