Apr 13,2023 15:05

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పూర్తిస్థాయిలో జగనన్న విద్యాకానుక కిట్లు అందజేయాలని రాష్ట్ర పరిశీలకులు, కెజిబివి డైరెక్టర్‌ డి.మధుసూధనరావు మండల కమిటీలకు సూచించారు . కడియం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన జివికె కిట్లు స్టాక్‌ పాయింట్‌ను గురువారం ఆయన పరిశీలించారు. మండల విద్యాశాఖాధికారి చైర్మన్‌ ఏర్పాటు చేసిన కమిటీలు పలు జాగ్రత్తలు తీసుకుంటూ మే నెలలో అన్ని పాఠశాలలకు జెవికె కిట్లు పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఇదే స్కూల్లో 2 కేంద్రాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షల తీరును మధుసూదనరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వి.లజపతిరారు, ఏఎంఓ గౌరీ శంకర్‌, సీఎంఓ నారాయణ రెడ్డి, పలువురు సీఆర్ఫీలు, సిబ్బంది పాల్గొన్నారు.