Mar 21,2023 15:33

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : 'కవనం సామాజిక చైతన్యానికి, విలువల సాధనకు ఒక సాధనమని' ప్రముఖ కవి, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి కళాశాల సమితి ప్రధాన కార్యదర్శి చిలుకూరి శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ కవితా దినోత్సవం చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి కళాసేవా సమితి అధ్యక్షులు అడపా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మంగళవారం కడియంలో జరిగింది. కవి చిలుకూరి మాట్లాడుతూ.. 1999 నుంచి ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా కవిత దినోత్సవాన్ని జరుపుతోందని పేర్కొన్నారు. 'ప్రపంచ మానవజాతుల సమ్మేళనానికి కవిత్వమొక కళాత్మక మైత్రి' అని అన్నారు. సోషల్‌ మీడియా మోజులో ఉన్న యువత కవిత్వం పట్ల ఆసక్తి పెంచుకోవాలని, కడియం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయులు గొల్లపల్లి సత్యనారాయణ, కర్రి రాజు, చెళ్లపిళ్ల ట్రెజరర్‌ బోణం సత్యనారాయణ పద్యాలు, కవితలు ఆలపించారు. పూర్వపు అధ్యక్షులు చిక్కాల ఈశ్వరరావు, యుటిఎఫ్‌ నాయకులు హనుమంతరావు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.