Jun 07,2023 11:32

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తీర్థం పంచాయతీ పరిధిలో ఉన్న వెంకటపతి చెరువు 69 మంది కూలీలు పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం ప్రజాశక్తితో కూలీలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు సంవత్సరంలో 100 రోజులు ఉపాధి హామీ కూలీలుగా పని చేస్తున్నామనీ, వంద రోజులు పూర్తి అయిన తర్వాత పరిధిలో లేక పనికి రాలేకపోతున్నాం అని వాపోయారు. 356 రోజులకు వంద రోజులు మాత్రమే పని చేయాల్సి వస్తుందనీ, 250 రోజులు ఖాళీగా ంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో వ్యవసాయ కూలీలు పనిచేద్దామంటే గిట్టుబాటు ధర లేదనీ, దీని ప్రభుత్వ అధికారులు గుర్తించి ఉపాధి హామీ పని దినములను 100 రోజుల నుండి 300రోజుల వరకు పెంచాలని కూలీలు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గణపతి, సర్పంచ్‌ జ్యోతి శ్రీనివాస్‌, ఎంపీటీసీ రవీంద్రమ్మ కుమారుడు కేశవులు, పార్టీలకు అతీతముగా పనిచేస్తున్న కూలీలు పాల్గొన్నారు.