ప్రజాశక్తి-నార్తల (అనంతపురం) : నార్పల బస్టాండ్ ఆవరణం గూగూడు రోడ్డు సంత మార్కెట్, తదితర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో అనుమానాస్పద వ్యక్తులు గాని వాహనాలు గాని కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కొద్ది రోజుల క్రితం కొందరు పెట్రోల్ దొంగలు స్థానిక గూగూడు రోడ్డులో రాత్రి సమయంలో ఇండ్ల ముందు నిలబెట్టిన బైక్‌లలో పెట్రోల్ చోరీ చేస్తూ పోలీసులను చూసి వారు వేసుకొని వచ్చిన బైక్‌ను గూగూడు రోడ్డు లోనే వదిలేసి వెళ్లడంతో ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆ దొంగల కోసం గాలిస్తున్నారు రాత్రి సమయంలో గూగూడు రోడ్డులో నిలిపి ఉంచిన బైకుల్లో పెట్రోల్ చోరీ చేస్తున్న దఅశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం ఆ దఅశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మండలంలో ఎక్కడైనా అనుమానాస్పదంగా గుర్తు తెలియని వాహనాలు కనిపించినా, చాలా రోజుల నుండి ఒకే ప్రదేశంలో నిలబెట్టి ఉన్నా... రాత్రి సమయంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా... ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా... వెంటనే పోలీసులకు కానీ, 9490107853 నెంబర్ కి కానీ సమాచారం అందచేసి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు మండల ప్రజలు సహకరించాలని ఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి కోరారు.










