Feb 25,2023 15:29

ప్రజాశక్తి- గోకవరం (తూర్పుగోదావరి) : జగనన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డివిజనల్‌ డెవలప్మెంట్‌ అధికారిని గోకవరం మండలం ప్రత్యేక అధికారి పి.వీణా దేవి ఆదేశించారు. శనివారం గోకవరం మండలంలో జగనన్న గృహ నిర్మాణ వారోత్సవాల్లో భాగంగా వెదురుపాక గుమ్మల దొడ్డి గ్రామాలలో గోకవరం ఎంపీడీవో చుండం శ్రీనివాసు దొర ఆధ్వర్యంలో జగనన్న గృహ నిర్మాణ పనులను వీణాదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. వెదురుపాక గుమ్మల దొడ్డి గ్రామాలకు సంబంధించిన లేఅవుట్‌లో 328 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని వీరందరికీ వివిధ స్థాయిలలో బేస్మెంట్‌ లెవెల్‌ 224 బేస్మెంట్‌ లెవెల్‌ 54 రూప్‌ లెవెల్‌ 8 పూర్తయిన గృహాలు 42లకు గృహ నిర్మాణ పనులను చేపడుతున్నారని తెలిపారు లబ్ధిదారులు గహ నిర్మాణాలు వేగవంతంగా చేయాలని తెలిపారు. గ్రామ వాలంటీర్లు ప్రతి ఒక్కరూ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ విస్తరణ అధికారి ఎం రాజేశ్వరరావు ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ హరీ రామకృష్ణ పంచాయతీ సెక్రటరీ ఫేనేంద్ర కుమార్‌ రమణకుమారి సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు