Mar 05,2023 11:32

ప్రజాశక్తి - ధవళేశ్వరం (తూర్పుగోదావరి) : ధవళేశ్వరం పిహెచ్సిలో డాక్టర్‌ కే.సుధాకర్‌ ఆధ్వర్యంలో హెల్తీ విమెన్‌ కార్యక్రమంలో ఆదివారం ఉదయం నిర్వహించారు. సందర్భంగా ధవళేశ్వరం పిహెచ్సి డాక్టర్‌ కె.సుధాకర్‌ మాట్లాడుతూ.. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ మన దినచర్యలో భాగంగా నడక,సైక్లింగ్‌,వ్యాయామము, యోగా వంటివి దయానందిన జీవితంలో కచ్చితంగా పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ద్విచక్ర వాహనానికి బదులుగా సైకిల్‌నీ ఎక్కువగా ఉపయోగించాలని తెలిపారు.