Aug 15,2023 14:53

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : మండలంలో పలుచోట్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కడియం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో అధ్యక్షులు మల్లు పోలరాజు , మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్‌, కడియం మసీదులో జిల్లా నూర్‌ బాషా సంఘం అధ్యక్షులు షేక్‌ సలీం, కడియం సొసైటీ నందు ఛైర్మన్‌ గిరజాలబాబు అలాగే పలు మండల కార్యాలయాలలో వివిధ శాఖల అధికారులు , గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌లు , సొసైటీలలో ఛైర్మన్‌లు జాతీయ పతాక ఆవిష్కరణలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపిడిఓ కే.రత్నకుమారి , వైస్‌ ఎంపిఒ పంతం గణపతి , ఈ.ఓ.పి.ఆర్‌.డి లక్ష్మీ , మండల పరిషత్‌ ఏ.ఓ చంద్రరావు , తదితరులు పాల్గొన్నారు.