ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువజన కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజరత్నం సెంటర్లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, వైసిపి రాష్ట్ర నాయకులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబులు పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోట తదితరులు మాట్లాడుతూ ... పేదల ప్రజల కోసం పెట్టిన వైసిపి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అనేక సంస్థలు, పెట్టుబడిదారులు ముందుకు వచ్చారన్నారు. దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ చిట్టూరి సతీష్, గ్రంధి శ్రీనివాస్, కొవ్వాడ బేబీ అప్పనబాబు, మొండి భవాని మురళి, జడ్పిటిసి కురుపుడు భవాని రాంబాబు, వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, వైసిపి నాయకులు సాధనాల శివ భగవాన్, కొప్పిరెడ్డి పద్మావతి, ముక్క దాలయ్య, ఏడిద గ్రామ అధ్యక్షులు పలివెల సుధాకర్, ఉండ్రాజవరపు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.










