ప్రజాశక్తి - ఆలమూరు (తూర్పు గోదావరి) : మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఆలమూరు మండల పరిధిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చింతలూరు, పెదపల్ల, చెముడులంక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు జరిగాయి. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నేతలు నివాళులు అర్పించారు. స్వాతంత్ర పోరాటంలో గాంధీ సేవలను స్మరించుకున్నారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు కంచర్ల గంగారావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కంచర్ల సూర్యనారాయణ, కంచర్ల పండు, వెత్సా నరసింహమూర్తి, వెత్సా నెహ్రూ, వెత్సా సురేష్, వైసీపీ నాయకులు తమ్మన శ్రీనివాస్, నామాల శ్రీనివాస్, నెక్కంటి వెంకటరాయుడు, నెక్కంటి ప్రమీల ప్రకాశ రావు, ఏడిద మెహర్, సత్యశ్రీ, రావాడ సత్తిబాబు, వాసవీ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.










