ప్రజాశక్తి -గోకవరం (తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్‌పి జగదీష్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి జగదీష్ విలేకరులతో మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం నేరాల అరికట్టే దిశగా ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు. దీనిలో భాగంగానే గోకవరం పోలీస్ స్టేషన్‌కు రావడం జరిగిందన్నారు. స్టేషన్ సిబ్బంది పని తీరుపై పలు రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిని, నిఘా విభాగాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలపై పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటును ఇంకా పెంచాలన్నారు. ముఖ్యంగా మారక ద్రవ్యాలు సారా, గంజాయి, రవాణా వంటి అసాంఘిక కార్యక్రమాలు రౌడీషీటర్లు, బ్లేడ్ బ్యాచ్, తెలగపాముల కదలికలపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో శాంతిభద్రతలపై ప్రత్యేక ధృష్టి సారించాలని ఎస్పీ జగదీష్ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ సిఐ ఉమామహేశ్వరరావు, గోకవరం ఎస్సై శివ నాగబాబు, సిబ్బంది పాల్గొన్నారు.










