ప్రజాశక్తి - ఉండ్రాజవరం(తూర్పుగోదావరి): చేతులు శుభ్రంగా ఉంటే, డయోరియా, శ్వాసకోశ వ్యాధులు వంటి వ్యాధుల నుండి కాపాడుకోవచ్చని ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం విశ్వ ప్రసాద్ ఆదివారం తెలిపారు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ను మండలంలోని పలు గ్రామ సచివాలయాలు, విద్యాసంస్థలు, పలు ప్రైవేట్ ప్రాంతాలలో, మండల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు నిర్వహించారు. మండలంలోని పలుచోట్ల నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెండే వెంకట రావు, ఐ రాంబాబు, విద్యార్థిని విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశాలు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.










