Oct 15,2023 17:16

ప్రజాశక్తి-కడియం(తూర్పు గోదావరి): కడియం గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అన్యూహ స్పందన లభించిందని  రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆదివారం స్థానిక హై స్కూల్ గ్రౌండ్ నందు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఎన్ టి ఆర్ ట్రస్ట్ మరియు జి ఎస్ ఆర్  గోరంట్ల శాంతా రావు ఫౌండేషన్ సంయుక్త సహకారంతో, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన  ఉచిత వైద్య శిబిరాన్ని  గోరంట్ల తో పాటుగా  రూరల్ నియోజకవర్గం పరిశీలకులు అంగర రామ్మోహన్రావు, కార్యదర్శి కాశి నవీన్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ పేదల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ప్రజల నుండి భారీ స్పందన లభించిందని ఉచిత వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేసి వ్యాధి నిర్ధారణ కొరకు అన్ని రక్త పరీక్షలు, ఎక్స్ రే వంటి అనేక వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు వ్యాధి నిర్ధారణ అనంతరం వారికి కావాల్సిన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారని  అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి 15 మంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పనిచేసే వైద్య నిపుణులు హాజరై సుమారు 600 మందికి పైగా ప్రజలకు ఉచితంగా చికిత్స చేశారని  గోరంట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో  వెలుగుబంటి రఘురామ్, మార్గాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.